Breaking News

కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్‌

Published on Sun, 01/11/2026 - 15:41

టీమిండియా సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు. భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి కోహ్లి చేరుకున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు.

కోహ్లికి ఇది 309వ వన్డే మ్యాచ్‌. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ తన కెరీర్‌లో 308 మ్యాచ్‌లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్(463) అగ్ర‌స్ధానంలో ఉన్నారు. అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలోనూ స‌చిన్(18426) టాప్‌లో కొన‌సాగుతున్నారు.

భారత్‌ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..
సచిన్‌ టెండూల్కర్‌-463
ఎంఎస్‌ ధోని-347
రాహుల్‌ ద్రవిడ్‌-340
అజారుద్దీన్‌-334
విరాట్‌ కోహ్లి-309
సౌరవ్‌ గంగూలీ-308

వన్డే కింగ్‌..
ఇక ప్రపంచ వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లి కూడా త‌న పేరును సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లి కొన‌సాగుతున్నాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 53 సెంచ‌రీలు న‌మోదు చేశాడు. అదేవిధంగా వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో కోహ్లి(14557) రెండో స్ధానంలో ఉన్నాడు. కోహ్లి దారిదాపుల్లో ఎవ‌రూ లేరు.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు