Breaking News

భారత్‌ కొత్త చరిత్ర

Published on Fri, 10/27/2023 - 03:55

హంగ్జౌ: వరుసగా నాలుగో రోజు తమ పతకాల వేటను కొనసాగిస్తూ ఆసియా పారా క్రీడల్లో భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలను సొంతం చేసుకుంది. 2018 జకార్తా ఆసియా పారా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 72 పతకాలను దక్కించుకోగా... హాంగ్జౌలో నాలుగో రోజు పోటీలు ముగిసేసరికి భారత బృందం 18 స్వర్ణాలు, 23 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 82 పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.

మరో రెండు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ఈసారి భారత్‌ పతకాల్లో ‘సెంచరీ’ని దాటే అవకాశముంది. గురువారం భారత్‌కు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలు వచ్చాయి. అథ్లెటిక్స్‌లో పురుషుల ఎఫ్‌46 కేటగిరీ షాట్‌పుట్‌ ఈవెంట్‌లో సచిన్‌ సర్జేరావు ఖిలారి ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.

అనంతరం ఆర్‌6 మిక్స్‌డ్‌ 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో భారత షూటర్‌ సిద్ధార్థ బాబు 247.7 పాయింట్లు స్కోరు పసిడి పతకాన్ని సాధించాడు. ఆర్చరీలో శీతల్‌ దేవి–రాకేశ్‌ కుమార్‌ జోడీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో 151–149తో లిన్‌ యుషాన్‌–అయ్‌ జిన్‌లియాంగ్‌ (చైనా) జంటపై నెగ్గి బంగారు పతకాన్ని దక్కించుకుంది.   

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)