మిల్లర్‌ క్యాచ్‌ కాదు.. నా లైఫ్‌లో ఇంపార్టెంట్‌ క్యాచ్‌ అదే: సూర్యకుమార్‌

Published on Tue, 07/09/2024 - 12:18

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో విజేత‌గా భార‌త్ నిల‌వ‌డంలో స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ది కీల‌క పాత్ర‌. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్లో డేవిడ్ మిల్ల‌ర్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న సూర్య‌కుమార్.. 13 ఏళ్ల టీమిండియా వ‌ర‌ల్డ్‌క‌ప్ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాడు. 

సూర్య త‌న సంచ‌ల‌న క్యాచ్‌తో  విశ్వ‌వేదిక‌పై భార‌త ప‌తాకాన్ని రెపరెపలాడించారు. భారత క్రికెట్ చరిత్రలో సూర్య పట్టిన క్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఫైనల్ మ్యాచ్ ముగిసి దాదాపు 10 రోజులు పైగా అవుతున్న‌ప్ప‌టికి సూర్య‌పై ఇంకా ప్రశంస‌ల వ‌ర్షం కురిస్తోంది. 

అయితే సూర్య త‌న జీవితంలో ఇంత‌కంటే ముఖ్య‌మైన క్యాచ్ ఎప్పుడో అందుకున్నాడంట. తన భార్య దేవిశా శెట్టిని వివాహం చేసుకోవడమే ముఖ్యమైన క్యాచ్ అంటూ సూర్య సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టిలు ఇటీవల తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌ సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్ద కేక్‌ను తీసుకువచ్చి కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సూర్యకుమార్ ఇనాస్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 

"వరల్డ్‌కప్‌లో క్యాచ్ అందుకుని నిన్నటకి 8 రోజులైంది. కానీ నిజానికి నా జీవితంలో అంత్యంత ముఖ్యమైన 8 ఏళ్ల క్రితమే అందుకున్నానంటూ" ఆ ఫోటోకు సూర్య క్యాప్షన్‌గా ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వ‌తున్నాయి. ఇది చూసిన నెటిజ‌న్లు మీరిద్ద‌రూ కలకలం ఇలానే సంతోషంగా కలిసి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

ఇక వ‌రల్డ్‌క‌ప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్య‌కుమార్‌.. 135.37 స్ట్రైక్‌రేట్‌తో 199 పరుగులు చేశాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌య‌నంత‌రం సూర్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి శ్రీలంక ప‌ర్య‌ట‌కు సూర్య‌కుమార్ అందుబాటులోకి రానున్నాడు.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)