Breaking News

మళ్లీ మనోడే నెంబర్‌ 1.. షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టిన సిరాజ్‌

Published on Wed, 11/08/2023 - 18:03

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అదరగొట్టాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో దుమ్మురేపుతున్న సిరాజ్‌.. పాక్‌ స్పీడ్‌ స్టార్‌ షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టి నంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సిరాజ్‌ ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో మూడు వికెట్లతో సిరాజ్‌ చెలరేగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా ఓ కీలక వికెట్‌ సాధించాడు. కాగా హైదరాబాద్‌ స్టార్‌ సిరాజ్‌ నెం1 ర్యాంక్‌కు చేరుకోవడం ఇది మూడో సారి.

ప్రస్తుతం బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 709 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్ మహరాజ్ (694 పాయింట్లు) ఉన్నాడు. అయితే భారత్‌ నుంచి కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో  కొనసాగుతున్నారు.

ఇక ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న గిల్‌.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను వెనక్కి నెట్టి నెం1 స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు.
చదవండి: Ben Stokes: సెంచరీతో అదరగొట్టిన స్టోక్స్‌.. వరల్డ్‌కప్‌లో ఇదే మొదటిది


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)