Breaking News

ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌.. 'సెంచరీ' కొట్టిన మహ్మద్ సిరాజ్‌

Published on Sun, 04/06/2025 - 21:44

ఐపీఎల్‌-2025లో టీమిండియా ఫాస్ట్ బౌలర్‌, గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు.

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ ఔట్ చేశాడు. ఓవరాల్‌గా సిరాజ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన వందో ఐపీఎల్ వికెట్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.

ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్‌గా సిరాజ్ మియా రికార్డులకెక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో సిరాజ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో సిరాజ్ రెండో స్ధానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. క్లాసెన్‌(27),కమ్మిన్స్‌(22) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్ర‌సిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు.
చ‌ద‌వండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌.. ముంబై ఇండియ‌న్స్‌కు డ‌బుల్ గుడ్‌న్యూస్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)