Breaking News

అన్నకు తగ్గ తమ్ముడు..

Published on Mon, 11/03/2025 - 20:39

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ షమీ సోదరుడు, బెంగాల్ పేసర్ మహ్మద్ కైఫ్.. తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.  అగర్తల వేదికగా త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో 28 ఏళ్ల కైఫ్‌ సత్తాచాటాడు. తన అన్న షమీ కంటే అద్బుతమైన బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచాడు.

మహ్మద్‌ కైఫ్‌ తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 19 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కైఫ్‌.. 53 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు బిక్రం కుమార్ దాస్, శ్రీదాం పాల్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన కైఫ్‌.. బిక్రంజిత్ దేబ్‌నాథ్‌ను ఎల్బీగా పెవిలియ‌న్‌కు పంపాడు. ఆ త‌ర్వాత సీనియ‌ర్ బ్యాట‌ర్ విజ‌య్ శంక‌ర్‌ను అద్బుత‌మైన బంతితో బోల్తా కొట్టించాడు.

కైఫ్‌పై న‌మ్మ‌కంతో బెంగాల్ కెప్టెన్ అభిషేక్ పోరెల్ మూడో రోజు ఆట‌లో ఎక్కువ ఓవ‌ర్లు బౌలింగ్ చేశాడు. అత‌డు అన్న షమీ అయితే 19 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్ సాధించకుండా 70 పరుగులు సమర్పించుకున్నాడు. 78 ఓవర్లు ముగిసేసరికి త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. క్రీజులో హనుమా విహారి(121), మణిశంకర్ మురాసింగ్(42) ఉన్నారు. బెంగాల్ బౌల‌ర్ల‌లో కైఫ్‌తో పాటు, ఇషాన్ పోరెల్, షాబాజ్ అహ్మద్, రాహుల్ ప్రసాద్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

కాగా కైఫ్ బెంగాల్ జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యుడు కాదు. 28 ఏళ్ల కైఫ్ కేవలం 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లే ఆడాడు. 18 ఇన్నింగ్స్‌ల‌లో అత‌డు 34 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ అయితే 20 ఏళ్లకే ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి.. నాలుగేళ్లు తిరిగక ముందే భార‌త్ త‌ర‌పున టెస్టు అరంగేట్రం చేశాడు.
చదవండి: Womens World Cup: విశ్వ విజేతలకు డైమండ్‌ నెక్లెస్‌లు..
 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)