Breaking News

రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ

Published on Tue, 01/09/2024 - 13:00

టీమిండియా పేస్‌ బాద్షా మొహమ్మద్‌ షమీ ఇవాళ (జనవరి 9) దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా షమీ ప్రతిష్టాత్మక అవార్డుచే సత్కరించబడ్డాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో అద్భుత ప్రదర్శన (7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతలతో 24 వికెట్లు) కారణంగా షమీ అర్జున్‌  అవార్డుకు ఎంపికయ్యాడు.

షమీతో పాటు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి. గతేడాది బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన చిరాగ్‌ చంద్రశేఖర్‌ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌లకు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. షమీకి ముందు ప్రస్తుత భారత క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌ (2021), రవీంద్ర జడేజా (2019), రోహిత్‌ శర్మ (2015), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2014), విరాట్‌ కోహ్లి (2013) అర్జున అవార్డులు గెలుచుకున్నారు.

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌ అనంతరం షమీ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు సైతం అతను దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ సమయానికి షమీ ఫిట్‌గా ఉంటాడని తెలుస్తుంది. 33 ఏళ్ల షమీ టీమిండియా తరఫున 64 టెస్ట్‌లు, 101 వన్డేలు, 23 టీ20లు ఆడి 448 వికెట్లు పడగొట్టాడు. షమీ ఖాతాలో రెండు టెస్ట్‌ అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. షమీకి ఐపీఎల్‌లో సైతం ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 110 మ్యాచ్‌లు ఆడి 127 వికెట్లు పడగొట్టాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)