మ‌హ్మ‌ద్ ష‌మీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవ‌రంటే?

Published on Sat, 11/22/2025 - 19:12

టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ మ‌రోసారి త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ త‌ర‌పున‌ ఆడ‌నున్నాడు. ఈ టోర్నీ కోసం బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ ప్ర‌కటించిన జ‌ట్టులో ష‌మీకి చోటు ద‌క్కింది. 

ఈ జ‌ట్టు కెప్టెన్‌గా వెట‌ర‌న్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఎంపిక‌య్యాడు. ష‌మీతో పాటు టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ కూడా బెంగాల్ జ‌ట్టులో ఉన్నాడు. ఈ జ‌ట్టులో వికెట్ కీప‌ర్‌గా అభిషేక్ పోరెల్ స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఈ టోర్నీ గ్రూప్-సిలో ఉన్న బెంగాల్ జట్టు.. నవంబర్ 26న హైదరాబాద్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ గ్రూపులో బెంగాల్‌తో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్, పుదుచ్చేరి, హర్యానా జట్లు ఉన్నాయి.

షమీ రీ ఎంట్రీ ఇస్తాడా?
కాగా మ‌హ్మ‌ద్ ష‌మీ గ‌త కొంత కాలంగా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్నాడు. ష‌మీ భార‌త్ త‌ర‌పున చివ‌ర‌గా ఈ ఏడాది మార్చిలో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడాడు. అప్ప‌టి నుంచి అత‌డు జ‌ట్టు బ‌య‌టే ఉంటున్నాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికి ష‌మీని మాత్రం సెల‌క్ట‌ర్లు ప‌రిగణ‌లోకి తీసుకోవ‌డం లేదు. 

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ మొదటి దశలో పూర్తిస్థాయిలో పాల్గొన్న ఈ వెటరన్ పేసర్.. ఏకంగా 20 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగానే షమీని జట్టులోకి తీసుకోవడం లేదని చెప్పుకొస్తున్నాడు.

కానీ ఇటీవల షమీ అయితే తన ఫిట్‌గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని పరోక్షంగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఒకవేళ షమీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్‌తో టీ20లకు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్‌), షకీర్ హబీబ్ గాంధీ , యువరాజ్ కేస్వానీ, ప్రియాంషు శ్రీవాస్తవ్, షాబాజ్ అహ్మద్, ప్రదీప్త ప్రమాణిక్, రిటిక్ ఛటర్జీ, కరణ్ లాల్. సాక్షం చౌదరి, మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్, యుధాజిత్ గుహా, శ్రేయాన్ చక్రవర్తి.
చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాము: స్టోక్స్‌

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)