Breaking News

బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌కు చుక్కలే!

Published on Tue, 05/02/2023 - 20:37

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో షమీ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షమీ ఐపీఎల్‌ కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. అందులోనూ పవర్‌ప్లేలోనే షమీ తన కోటా పూర్తి చేయడంతో నాలుగు వికెట్లు తీసుకోవడం మరో విశేషం.

షమీ తన ఫామ్‌ను ఇలాగే కంటిన్యూ చూస్తే ఐపీఎల్‌ తర్వాత జరగనున్న డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్‌కు కష్టాలు తప్పేలా లేవు, ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా పేస్‌ దళాన్ని షమీనే నడిపించాల్సి ఉంది. గాయంతో బుమ్రా దూరం కావడంతో.. షమీ పెద్దన్న పాత్ర పోషించనున్నాడు. అంతవరకు షమీ గాయపడకుండా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఆసీస్‌కు చుక్కలే. జూన్‌ ఏడు నుంచి 11వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది.

ఇక ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఇషాంత్‌ శర్మ( 5/12,  వర్సెస్‌ కొచ్చిన్‌ టస్కర్స్‌, 2012) ఉన్నాడు. రెండో స్థానంలో షమీ(4/7, వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌,2023), మూడో స్థానంలో ధవల్ కులకర్ణి (4/8 -వర్సెస్‌ ఆర్‌సీబీ, 2016),  నాలుగో స్థానంలో  అజిత్ చండిలా (4/9 వర్సెస్‌ పుణే వారియర్స్‌, 2012) ఉన్నారు.

చదవండి: ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు.. ఇలాంటి ప్లేయర్‌ అవసరమా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)