Breaking News

‘సారీ బ్రదర్... దీన్నే కర్మ అంటారు' అక్తర్‌కి కౌంటర్ ఇచ్చిన షమీ

Published on Sun, 11/13/2022 - 20:11

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచకప్‌-2022 విజేతగా నిలిచింది. అయితే ఫైనల్లో పాక్‌ ఓటమిని ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమి అనంతరం పాకిస్తాన్‌ దిగ్గజ పేసర్‌ ‘గుండె బద్ధలైంది’ అన్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేశాడు.

అయితే అక్తర్‌ ట్వీట్‌పై భారత పేసర్‌ మహ్మద్‌ షమీ వ్యంగ్యంగా స్పందించాడు. ‘సారీ బ్రదర్... దీన్నే  కర్మ ’ అంటారు అంటూ షమీ రిప్లే ఇచ్చాడు. కాగా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఓటమి పాలై ఇంటిముఖం పట్టిన భారత జట్టును పాక్‌ మాజీలు హేళన చేశారు. "ఈ ఆటతీరుతో ప్రపంచకప్‌ ఫైనల్‌కు వస్తుందా.. పాక్‌తో తలపడే అర్హత  టీమిండియాకు లేదంటూ " అక్తర్‌ కూడా విమర్శలు చేశాడు. దీనికి బదులుగా షమీ ఇప్పుడు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

అదృష్టం కలిసొచ్చి సెమీస్‌కు
గ్రూప్‌ స్టేజీలోనే ఇంటి దారి పడుతోంది అనుకున్న పాకిస్తాన్‌ జట్టు అదృష్టం కలిసొచ్చి సెమీస్‌లో అడుగుపెట్టింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలవ్వడంతో పాకిస్తాన్‌ లక్కీగా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయంతో పాక్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ పటిష్టమైన ఇంగ్లండ్‌ ముందు పాక్‌ తలవంచింది. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైన పాకిస్తాన్‌ రన్నరప్‌గా నిలిచింది.


చదవండి: T20 WC 2022: అప్పుడు వన్డే ప్రపంచకప్‌.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌! హీరో ఒక్కడే

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)