Breaking News

ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు.. మహ్మద్‌ రిజ్వాన్‌ అరుదైన రికార్డు

Published on Fri, 11/08/2024 - 13:49

అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో పాకిస్తాన్ కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ వికెట్ల వెన‌క అద్బుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా 6 క్యాచ్‌ల‌ను అందుకున్నాడు. త‌ద్వారా ఓ అరుదైన ఫీట్‌ను రిజ్వాన్ త‌న పేరిట లిఖించుకున్నాడు.

వ‌న్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పాకిస్తాన్‌ వికెట్‌కీపర్‌గా స‌ర్ఫ‌రాజ్ ఆహ్మ‌ద్ రికార్డును స‌మం చేశాడు. మార్చి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వ‌న్డేలో స‌ర్ఫరాజ్ కూడా ఆరు క్యాచ్‌ల‌ను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో స‌ర్ఫ‌రాజ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రిజ్వాన్‌కు ల‌భించింది. కానీ జంపా ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రిజ్వాన్ జార‌విడ‌చ‌డంతో ఆహ్మ‌ద్‌ను అధిగ‌మించ‌లేక‌పోయాడు. లేదంటే 7 క్యాచ్‌ల‌తో స‌ర్ఫ‌రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయివుండేది.
నిప్పులు చెరిగిన ర‌వూఫ్‌
కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్పీడ్‌స్టర్ హారిస్ రౌఫ్ నిప్పులు చేరిగాడు.   రౌఫ్‌ 5 వికెట్ల హాల్‌తో చెల‌రేగాడు. ఆసీస్ బ్యాటర్ల‌కు వారి సొంత‌గ‌డ్డ‌పైనే రౌఫ్ చుక్క‌లు చూపించాడు. అత‌డి పేస్ బౌలింగ్ ధాటికి కంగారులు బెంబేలెత్తిపోయారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ కేవ‌లం 29 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 163 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. రౌఫ్‌తో పాటు షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్ల ప‌డ‌గొట్టి ఆసీస్ ప‌త‌నాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో స్టీవ్ స్మిత్‌(35) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs SA: 'అత‌డికి ఇది డూ ఆర్ డై సిరీస్‌.. లేదంటే ఇక మ‌ర్చిపోవాల్సిందే'
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)