Breaking News

మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం..

Published on Tue, 10/28/2025 - 20:40

పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2025-26 సీజన్‌కు సంబంధించి పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (PCB) సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రిజ్వాన్ తిరష్కరించినట్లు సమాచారం. మొత్తం 30 మంది క్రికెటర్లలో రిజ్వాన్ ఒక్కడే సెంట్రాక్ట్ కాంట్రాక్ట్ పేపర్లపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

తనను టీ20 జట్టు నుంచి తప్పించడంతో రిజ్వాన్ ఆసంతృప్తిగా ఉన్నట్లు పాక్‌కు చెందిన జియో  'జియో సూపర్' తమ కథనంలో పేర్కొంది. అయితే బోర్డు ముం‍దు రిజ్వాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సదరు వెబ్‌సైట్ వెల్లడించింది.

తన డిమాండ్లను నెరవేరిస్తానే కాంట్రాక్ట్‌పై సంతకం చేస్తానని రిజ్వాన్ తెలిపాడంట. పీసీబీ కొత్త కాంట్రాక్ట్ జాబితాలో రిజ్వాన్ కేటగిరీ బిలో ఉన్నారు. స్టార్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజం కూడా ఇదే కేట‌గిరీలో ఉన్నాడు. గ‌తంలో వీరిద్ద‌రూ కేట‌గిరీ ఎలో ఉండేవారు. కానీ పీసీబీ ఈసారి పూర్తి కేటగిరీ ఎనే తొలిగించింది.

కాగా రిజ్వాన్‌ను తాజాగా పాక్ జ‌ట్టు వ‌న్డే కెప్టెన్సీ నుంచి కూడా  తొల‌గించారు. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌లో పాక్ జ‌ట్టుకు స్టార్ పేస‌ర్  షాహీన్ షా ఆఫ్రిది జట్టుకు నాయకత్వం వ‌హించాడు. రిజ్వాన్ కెప్టెన్సీలో పాక్ 20 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి, 11 ఓటములను చ‌విచూసింది. 

కెప్టెన్‌గా అత‌డి విజ‌య శాతం 45గా ఉంది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో బాబ‌ర్ ఆజం నుంచి రిజ్వాన్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. కానీ నాయ‌కుడిగా జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిపై పీసీబీ వేటు వేసింది.

పాక్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితా ఇదే
కేటగిరీ B
అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాదాబ్ ఖాన్ మరియు షాహీన్ షా ఆఫ్రిది.

కేటగిరీ C
అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమాన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్ మరియు సౌద్ షకీల్.

కేటగిరీ D
అహ్మద్ డానియల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్ మరియు సూఫియాన్ మొకీమ్.
చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ గాయంపై బీసీసీఐ మరో అప్‌డేట్‌
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)