Breaking News

'పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు.. కొంచెం కూడా గేమ్ ప్లాన్ లేదు': అక్రమ్‌

Published on Mon, 06/10/2024 - 21:46

టీ20 వరల్డ్‌కప్‌-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఆదివారం న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ చ‌త‌కిల‌ప‌డింది.

దీంతో త‌మ సూప‌ర్-8 ఆశ‌ల‌ను పాక్ సంక్లిష్టం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ వంటి సీనియర్ పాక్ ఆటగాళ్లపై ఆ దేశ మాజీ కెప్టెన్ వ‌సీం అక్ర‌మ్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు.  జస్ప్రీత్ బుమ్రాను  మ‌హ్మ‌ద్ రిజ్వాన్ మరింత జాగ్రత్తగా ఆడుంటే ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేద‌ని అక్ర‌మ్ మండిప‌డ్డాడు.

"వారు 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారు. మా ఆటగాళ్లకు క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పించలేను.  తొలుత మహ్మద్ రిజ్వాన్‌కు అస్స‌లు గేమ్‌పై అవగాహన లేదు. వికెట్లు తీయడానికే బుమ్రాను రోహిత్‌ ఎటాక్‌లోకి తెచ్చాడని రిజ్వాన్‌కు తెలుసు. 

అటువంటి అప్పుడు అతడి బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. కానీ రిజ్వాన్‌ మాత్రం రిజ్వాన్ భారీ షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. ఇక ఇఫ్తికార్ అహ్మద్‌కి లెగ్ సైడ్‌ ఆడటం తప్ప ఇంకేమి రాదు. గతకొన్నేళ్లగా జట్టులో భాగమైనా బ్యాటింగ్‌ ఎలా చేయాలి అతడికి తెలియదు.

 పాక్ ఆటగాళ్లకు ఒక్కటే తెలుసు. మేము ఆడకపోతే మాకెంటి నష్టం, కోచ్‌లను కదా తొలగిస్తారని థీమాగా ఉన్నారు. కానీ నావరకు అయితే కోచ్‌లను కొనసాగించి మొత్తం జట్టును మార్చాల్సిన సమయమిదని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు