Breaking News

పాకిస్తాన్‌ వైస్‌ కెప్టెన్‌గా మొహమ్మద్‌ రిజ్వాన్‌

Published on Mon, 01/08/2024 - 14:35

పాకిస్తాన్‌ టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌ అనంతరం కెప్టెన్‌గా బాబర్‌ ఆజమ్‌ తప్పుకోవడంతో పాక్‌ టీ20 జట్టుకు కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది ఎంపిక కాగా.. తాజాగా అఫ్రిదికి డిప్యూటీగా రిజ్వాన్‌ ఎంపిక చేశారు పాక్‌ సెలెక్టర్లు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నుంచి అఫ్రిది, రిజ్వాన్‌ బాధ్యతలు చేపడతారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం పాక్‌ న్యూజిలాండ్‌ గడ్డపై ల్యాండ్‌ అయ్యింది. జనవరి 12, 14, 17, 19, 21 తేదీల్లో ఆక్లాండ్‌, హామిల్టన్‌, డునెడిన్‌, క్రైస్ట్‌ చర్చ్‌ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. బాబర్‌ ఆజమ్‌ పాక్‌ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఆ దేశ టెస్ట్‌ జట్టుకు షాన్‌ మసూద్‌ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్ట్‌, టీ20 జట్లకు కెప్టెన్లను ప్రకటించిన పీసీబీ వన్డే జట్టు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ఇటీవలే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడిన పాక్‌.. 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌ మొత్తం పాక్‌ పేలవ ప్రదర్శన కనబర్చి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌కు ముందు వరల్డ్‌కప్‌లోనూ పాక్‌ చెత్త ఆడి సెమీస్‌కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

న్యూజిలాండ్‌తో ఐదు టీ20లకు పాక్‌ జట్టు: షాహీన్‌ ఆఫ్రిది (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్) , మహ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్, జమాన్ ఖాన్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)