Breaking News

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌.. సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్‌ రిజ్వాన్‌

Published on Thu, 08/22/2024 - 13:39

రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌ సెంచరీతో కదంతొక్కాడు. రిజ్వాన్‌ తన సెంచరీ మార్కును 143 బంతుల్లో తాకాడు. రిజ్వాన్‌ కెరీర్‌లో ఇది మూడో టెస్ట్‌ శతకం. ప్రస్తుతం రిజ్వాన్‌ 147 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 75 ఓవర్లు ముగిసే సరికి పాక్‌ స్కోర్‌ 277/గా ఉంది. రిజ్వాన్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న సౌద్‌ షకీల్‌ కూడా సెంచరీకి చేరువయ్యాడు. షకీల్‌ 182 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.  

కాగా, పాక్‌ 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. తొలి రోజు ఆటలో పాక్‌ అబ్దుల్లా షఫీక్‌ (2), సైమ్‌ అయూబ్‌ (56), షాన్‌ మసూద్‌ (6), బాబర్‌ ఆజమ్‌ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్‌ ఇస్తాం, హసన్‌ మహ్మూద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బంగ్లాదేశ్‌ ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో సౌద్‌ షకీల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్‌ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. షకీల్‌ 1000 పరుగుల మార్కును తాకేందుకు 20 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 1959లో సయీద్‌ అహ్మద్‌ కూడా ఇన్నే ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలురాయిని తాకాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)