Breaking News

హార్దిక్‌ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్‌: పాక్‌ మాజీ కెప్టెన్‌

Published on Thu, 03/13/2025 - 17:41

హార్దిక్ పాండ్యా(Hardhik Pandya).. భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో తన ఆల్‌రౌండ్‌​ ప్రదర్శనలతో టీమిండియాకు అద్బుతమైన విజయాలను అందిస్తున్నాడు. బంతితో మ్యాజిక్‌, బ్యాట్‌తో విధ్వంసం చేయగల సత్తా అతడిది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ హార్ధిక్‌ది కీలక పాత్ర.

బౌలింగ్, బ్యాటింగ్‌లో పాండ్యా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 వరల్డ్‌కప్‌-2024లోనూ ఈ బరోడా ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. ఈ క్రమంలో పాండ్యాను పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్‌, మహ్మద్ హఫీజ్ ప్రశంసించారు. పాండ్యా తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్బుతాలు చేస్తున్నాడని వారిద్దరూ కొనియాడారు.

"హార్దిక్ పాండ్యా ఏమి.. మాల్కం మార్షల్‌, వాకార్ యూనిస్, జవగల్ శ్రీనాథ్, బ్రెట్ లీ కాదు. ఈ లెజెండ్స్ లాంటి స్కిల్స్‌​ పాండ్యాకు లేవు. కానీ బంతితో మాత్రం అద్బుతాలు సృష్టిస్తున్నాడు. కొత్త బంతితో చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన సత్తాచూపిస్తున్నాడు. హార్దిక్ అంత పెద్ద హిట్టర్ కూడా కాదు. కానీ త‌న టెక్నిక్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు. నిజంగా అత‌డిని మెచ్చుకోవాల్సిందే. 2000లో పాకిస్తాన్ జ‌ట్టులో హార్దిక్ లాంటి ఆట‌గాళ్లు చాలా మంది ఉండేవారు అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అక్త‌ర్ పేర్కొన్నాడు. కాగా అక్త‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రో మాజీ క్రికెట‌ర్ మహ్మద్ హఫీజ్ ఏకీభ‌వించాడు.

"అక్త‌ర్ భాయ్ చెప్పింది అక్ష‌రాల నిజం. అబ్దుల్ ర‌జాక్ వంటి ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను చూస్తే మ‌న‌కు ఆర్ద‌మ‌వుతోంది. అత‌డు హార్దిక్ పాండ్యా కంటే చాలా బెట‌ర్‌. అత‌డొక మ్యాచ్ విన్న‌ర్‌. కానీ పాకిస్తాన్ క్రికెట్‌లో అతడికి సరైన గౌరవం దక్కలేదు. రజాక్‌లో కూడా స్కిల్స్‌​ తక్కువగా ఉన్నప్పటికి.. అద్బుతమైన ప్రదర్శన చేసే వాడని" హాఫీజ్ చెప్పుకొచ్చాడు.

కాగా రజాక్‌.. తన కెరీర్‌లో పాకిస్తాన్‌ తరపున 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్‌లో వరుసగా 1946, 5080, 393 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి పేరిట 269 వికెట్లు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్‌ నిలవగా.. పాకిస్తాన్‌ మాత్రం దారుణ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
చదవండి: WC 2027: రోహిత్‌ శర్మ ప్లానింగ్‌ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)