Breaking News

ఐపీఎల్‌-2024లో ఆడనున్న పాకిస్తాన్ బౌలర్‌.. అది ఎలా అంటే?

Published on Mon, 07/03/2023 - 19:53

పాకిస్తాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్‌ బౌలర్లలో మహ్మద్‌ అమీర్‌ ఒక్కడు. పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా 2020 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనూహ్యంగా అమీర్‌ తప్పుకున్నాడు. అయితే పీసీబీ చైర్మెన్‌ రమీజ్‌ రజా తప్పకోవడంతో అమీర్‌ మళ్లీ పాకిస్తాన్‌ తరపున క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలు వినిపించాయి.

కానీ అమీర్‌ పాకిస్తాన్‌కు కాకుండా ఐపీఎల్‌లో ఆడేందుకు అస్త్రాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2008 ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత ఏ ఒక్క పాక్‌ ఆటగాడు కూడా క్యాష్‌రిచ్‌ లీగ్‌లో ఆడటంలేదు. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తల కారణంగా పాక్ ప్లేయర్లపై ఐపీఎల్‌లో నిషేధం విధించారు. అయితే అమీర్‌ మరి ఎలా ఐపీఎల్‌ ఎం‍ట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడని మీకు సందేహం కలగవచ్చు. 

యూకే పౌరసత్వం పొందనున్న అమీర్‌
అమీర్‌ 2016లో బ్రిటిష్ యువతి, లాయర్ నర్జీస్ ఖాన్‌ని వివాహం చేసుకున్నాడు. అమీర్‌ ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంగ్లండ్‌లోనే ఉంటున్నాడు. అతడు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పూర్తిగా పాకిస్తాన్‌ నుంచి ఇంగ్లండ్‌కు మకాం మార్చాడు. ఈ క్రమంలో 2024లో  బ్రిటీష్ పాస్‌పోర్ట్‌తో పాటు, యూకే పౌరసత్వం పొందనున్నట్లు సమాచారం.

తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్‌ తన ఐపీఎల్‌ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చాడు. "నేను ముందుగా ఇంగ్లండ్‌కు ఆడాలనుకోవడంలేదు. ఎందుకంటే ఇప్పటికే నేను పాకిస్తాన్‌ తరపున అంతర్జాతీయ స్ధాయిలో ప్రాతినిధ్యం వహించాను. ఐపీఎల్ గురించి ఇంకా ఆలోచించలేదు.  నేను బ్రిటన్‌ నుంచి నా పాస్‌పోర్ట్ పొందడానికి ఇంకా ఒక  సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికైతే ఒక్కో అడుగు వేయాలని అనుకుంటున్నా" అని అమీర్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్‌

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)