Breaking News

పాక్‌తో టైటిల్‌ కంబాట్‌.. కళ్లన్నీ 40 ఏండ్ల సంగ్రామ్‌ పైనే!

Published on Sun, 07/19/2026 - 09:03

భార‌త రెజ్లింగ్ దిగ్గ‌జం, మిక్స్ మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్ సంగ్రామ్ సింగ్ త‌న కెరీర్‌లోనే కీల‌క పోరుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్ర‌తిష్టాత్మ‌క స్ట్రైక్‌ ఆసియా చాంపియ‌న్‌షిప్ టైటిల్ కోసం పాకిస్తాన్ రెజ్ల‌ర్ అబిద్ అలీతో త‌ల‌ప‌డ‌నున్నాడు. రెండు దేశాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచేస్తున్న ఈ పోరు భార‌త కాల‌మ‌నా ప్ర‌కారం సాయంత్రం 7 గంట‌లకు ప్రారంభం కానుంది. 


PC: MMA Twitter

ఈ టైటిల్ ఫైట్ కంబాట్ క్రీడా వ‌ర్గాల్లో భారీగా అంచ‌నాల‌ను రేకెత్తిస్తోంది. ఈ ఫైట్‌లో గెలిచిన వారికి స్ట్రైక్ ఆసియా చాంపియ‌న్ కిరీటం ద‌క్క‌నుంది. 40 ఏండ్ల వయసులో ప్రొఫెష‌న‌ల్ రెజ్ల‌ర్ నుంచి మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ప్లేయ‌ర్‌గా మారిన సంగ్రామ్ సింగ్ ఇప్ప‌టివ‌ర‌కు తన అన్ని కంబాట్స్‌లోనే గెలిచి అజేయంగా నిలిచాడు. ఎంఎంఏ కెరీర్ ఆరంభించిన త‌ర్వాత జార్జియాలో జ‌రిగిన త‌న అరంగేట్రం మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు చెందిన అలీ ర‌జా నాసిర్‌ను కేవ‌లం 90 సెకన్ల‌లో ఓడించి ప్ర‌పంచ వేదిక‌పై త‌న ఉనికిని ఘ‌నంగా చాటుకున్నాడు. 

ఆ త‌ర్వాత నెద‌ర్లాండ్స్‌లో ట్యూనీషియాకు చెందిన హ‌కీమ్ ట్రాబెల్సీపై, అర్జెంటీనాలో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోరియ‌న్ కౌడియ‌ర్‌పై వ‌రుస విజ‌యాలు న‌మోదు చేశాడు. అర్జెంటీనా గ‌డ్డ‌పై ప్రొఫెష‌న‌ల్ ఎంఎంఏ బౌట్‌లో గెలిచిన తొలి భార‌తీయుడిగా సంగ్రామ్ సింగ్ రికార్డుల‌కెక్కాడు. దీంతో అత‌డి అజేయ ప్రొఫెష‌న‌ల్ రికార్డు 3-0కి విస్త‌రించింది. 


PC: MMA Twitter

కాగా టైటిల్ పోరుకు ముందు సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. 'నేను కేజ్‌లోకి అడుగుపెట్టిన ప్ర‌తీసారి నాకోసం ఆడ‌ను. 140 కోట్ల మంది భార‌తీయుల కోసమే పోరాడ‌తాను. క్రీడ ఏదైనా స‌రే, భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య పోరు ఎప్పుడు ప్ర‌త్యేకంగానే ఉంటుంది. టైటిల్ కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నా' అని సంగ్రామ్ సింగ్ పేర్కొన్నాడు. 

ఆదివారం జ‌ర‌గ‌నున్న పోరులో సంగ్రామ్ గెలిస్తే స్ట్రైక్ ఆసియా చాంపియ‌న్ టైటిల్‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో పాటు భార‌త్ నుంచి ప్ర‌పంచ‌ మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో త‌న స్థానాన్ని మ‌రింత సుస్థిరం చేసుకోనున్నాడు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)