Breaking News

వ‌రుసగా ఐదు ఓట‌ములు.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న స‌న్‌రైజ‌ర్స్ స్టార్‌

Published on Sat, 06/28/2025 - 09:01

మేజర్ లీగ్ క్రికెట్(MLC)-2025లో సియాటిల్ ఓర్కాస్ జట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల‌లోనూ ఓట‌మి చ‌విచూసిన ఓర్కాస్‌.. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానంలో కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సియాటిల్ ఓర్కాస్ హెడ్ కోచ్ మాథ్యూ మాట్‌, కెప్టెన్ హెన్రిస్ క్లాసెన్(Heinrich Klaasen) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

సీజన్ మ‌ధ్య‌లోనే వీరిద్దరూ త‌మ ప‌ద‌విల‌కు రాజీనామా చేశారు. మాథ్యూ మాట్ జ‌ట్టును వీడ‌గా.. క్లాసెన్ ఇక‌పై కేవ‌లం ఆట‌గాడిగా మాత్ర‌మే కొన‌సాగ‌నున్నాడు. క్లాసెన్ స్ధానంలో ఓర్కాస్ కెప్టెన్‌గా జింబాబ్వే స్టార్ సికింద‌ర్ ర‌జా కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఈ విష‌యాన్ని సియాటిల్ ఓర్కాస్ ఫ్రాంచైజీ ధ్రువీక‌రించింది.

"మా ఫ్రాంచైజీతో ఉన్న స‌మ‌యంలో మాథ్యూ మాట్ చూపిన నిబ‌ద్ద‌త‌, ప్రొఫెషనలిజమ్​కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అతడు తన భవిష్యత్ ప్రణాళికలలో సఫలం కావాలని కోరుకుంటున్నాము. ఇక హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి స్వచ్ఛందంగా కెప్టెన్ పదవి నుంచి వైదొలగాడు.

అతడు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. అతడు ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు మేలు కోసమే అని నమ్ముతున్నాము. క్లాసెన్ స్ధానంలో సికందర్ రజాను కెప్టెన్‌గా ఎంపిక చేశాము. ఈ ఏడాది సీజన్ సెకెండ్‌హాఫ్‌లో మేము బలంగా పుంజుకుంటామని ఆశస్తున్నాము" అని సియాటిల్ సీఈవో హేమంత్ దువా ఓప్రకటనలో పేర్కొన్నారు. క్లాసెన్ బ్యాటింగ్‌లో కూడా పెద్ద‌గా రాణించలేక‌పోయాడు. 5 ఇన్నింగ్స్‌లలో కేవ‌లం 54 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.  ఈ ఏడాది సీజ‌న్‌లో అత‌డి అత్య‌ధిక స్కోర్ 27గా ఉంది.
చదవండి: IND vs ENG: వైభవ్ సూర్య‌వంశీ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)