రసవతర్త పోరులో ముంబై ఇండియ‍న్స్‌ను గెలిపించిన బౌల్ట్‌

Published on Thu, 07/10/2025 - 11:09

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో ఇవాళ (జులై 10) రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎం న్యూయార్క్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఎంఐ చివరి ఓవర్‌లో గట్టెక్కి ఛాలెంజర్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిన యూనికార్న్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

డల్లాస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో (4-0-19-2) అదరగొట్టిన బౌల్ట్‌, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు. 

132 పరుగుల స్వల్ప ఛేదనలో 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బౌల్ట్‌.. 13 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 22 పరుగులు చేసి ఎంఐని గెలిపించాడు. ఈ ప్రదర్శనలకు గానూ బౌల్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. జులై 11న జరిగే ఛాలెంజర్‌ మ్యాచ్‌లో ఎంఐ టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.

మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్షం దోబూచుల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎంఐ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బౌల్ట్‌ సహా రుషిల్‌ ఉగార్కర్‌ (3.1-0-19-3), కెంజిగే (4-0-43-2), ట్రిస్టన్‌ లూస్‌ (4-0-32-1), పోలార్డ్‌ (2-0-11-1) రాణించడంతో యూనికార్న్స్‌ను 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 

62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన చేతులెత్తేసిన యూనికార్న్స్‌ను జేవియర్‌ బార్ట్‌లెట్‌ (44), బ్రాడీ కౌచ్‌ (19) ఆదుకొని గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. వీరి మినహా యూనికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో కూపర్‌ కన్నోలీ (23), హమ్మద్‌ ఆజమ్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ఎంఐ తొలుత ఆడుతూ పాడుతూ విజయం సాధించేలా కనిపించింది. అయితే మాథ్యూ షార్ట్‌ (4-0-22-3), హసన్‌ ఖాన్‌ (4-0-30-4) ఒక్కసారిగా విజృంభించడంతో కష్టాల్లో పడింది. 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. 

గెలుపుకు ఇంకా 25 పరుగులు కావాల్సిన తరుణంలో బౌల్ట్‌ బ్యాట్‌ ఝులిపించి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు. అతనికి లూస్‌ (8), కెంజిగే (3 నాటౌట్‌) సహకరించారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో మొనాంక్‌ పటేల్‌ (33), డికాక్‌ (33) రాణించారు. పూరన్‌ (1), పోలార్డ్‌ (5) విఫలమయ్యారు.

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)