Breaking News

రచిన్‌ మాయాజాలం.. హెడ్‌ మెరుపులు.. మ్యాక్స్‌వెల్‌ ఊచకోత

Published on Fri, 07/26/2024 - 10:46

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024లో వాషింగ్టన్‌ ఫ్రీడం ఫైనల్‌కు చేరింది. ఇవాళ (జులై 26) జరిగిన క్వాలిఫయర్‌లో ఆ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనికార్న్స్‌.. రచిన్‌ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్‌ (4-0-46-3), నేత్రావల్కర్‌ (4-0-23-2), ఫెర్గూసన్‌ (3.2-0-24-1) ధాటి​​కి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో హసన్‌ ఖాన్‌ (57) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​​కి దిగిన వాషింగ్టన్‌.. ట్రవిస్‌ హెడ్‌ (44 బంతుల్లో 77 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (23 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో సునయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది. 

వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ 1, ఆండ్రియస్‌ గౌస్‌ (9), రచిన్‌ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. యూనికార్న్స్‌ బౌలర్లలో హసన్‌ ఖాన్‌ 2, పాట్‌ కమిన్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. యూనికార్న్స్‌ రేపు జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్‌ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)