సిక్సర్ల వర్షం కురిపిస్తున్న స్టీవ్‌ స్మిత్‌

Published on Tue, 07/09/2024 - 14:09

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో (ఎంఎల్‌సీ) ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్‌.. తన శైలికి విరుద్దంగా భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన స్టీవ్‌.. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. స్టీవ్‌ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన స్టీవ్‌.. టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌తో నిన్న (జులై 8) రద్దైన మ్యాచ్‌లో 13 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ రెండో ఎడిషన్‌  గత సీజన్‌కు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్‌లే జరగ్గా.. సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు నమోదయ్యాయి.

వాషింగ్టన్‌ ఫ్రీడం, టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకకుండా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ సెంచరీతో (58 బంతుల్లో 100; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. 

ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన వాషింగ్టన్‌ ఫ్రీడంకు వరుణుడు అడ్డుతగిలాడు. ఆ జట్టు తొలి నాలుగు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 62 పరుగులు చేసిన తరుణంలో వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ ఇచ్చి మ్యాచ్‌ను రద్దు చేశారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)