Breaking News

సిక్సర్ల వర్షం కురిపించిన జోస్‌ ఇంగ్లిస్‌.. స్మిత్‌ సేనకు తొలి ఓటమి

Published on Tue, 07/23/2024 - 11:08

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌లో స్టీవ్‌ స్మిత్‌ నేతృత్వలోని వాషింగ్టన్‌ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్‌ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన యూనికార్న్స్‌కు టార్గెట్‌ నిర్దేశించారు. 

యూనికార్న్స్‌ టార్గెట్‌ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్‌.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్‌ ఇంగ్లిస్‌ (17 బంతుల్లో 45; ఫోర్‌, 6 సిక్సర్లు), సంజయ్‌ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్‌ ఖాన్‌ (11 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు. 

వాషింగ్టన్‌ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్‌ హొసేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్‌ హెడ్‌ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆండ్రియస్‌ గౌస్‌ (29 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

కాగా, ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్‌, యూనికార్న్స్‌ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్‌, యూనికార్న్స్‌ తొలి రెండు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్‌ సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)