Breaking News

నరైన్‌, రసెల్‌ విఫలం.. నైట్‌రైడర్స్‌ ఓటమి

Published on Wed, 07/10/2024 - 15:37

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌లో సియాటిల్‌ ఓర్కాస్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో ఓర్కాస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. జేసన్‌ రాయ్‌ (52 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (22 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 

సునీల్‌ నరైన్‌ (5), ఉన్ముక్త్‌ చంద్‌ (18), షకీబ్‌ అల్‌ హసన్‌ (7), ఆండ్రీ రసెల్‌ (14) నిరాశపరిచారు. ఓర్కాస్‌ బౌలర్లలో జమాన్‌ ఖాన్‌, హర్మీత్‌ సింగ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓర్కాస్‌.. ర్యాన్‌ రికెల్టన్‌ (66 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. రికెల్టన్‌కు జతగా క్వింటన్‌ డికాక్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (51 నాటౌట్‌) ఆడాడు. ఓర్కాస్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ (నౌమన్‌ అన్వర్‌ (9)) స్పెన్సర్‌ జాన్సన్‌కు దక్కింది.   

ఎంఎల్‌సీ ప్రస్తుత ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లు అయిన అనంతరం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్‌ ఫ్రీడం టాప్‌లో ఉంది.  శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, ఎంఐ న్యూయార్క్‌, లాస​ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌, సీయాటిల్‌ ఓర్కాస్‌, టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)