Breaking News

చెలరేగిన డేనియల్‌ సామ్స్‌.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సూపర్‌ కింగ్స్‌

Published on Tue, 07/25/2023 - 10:59

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. నిన్న (జులై 24) శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన సూపర్‌ కింగ్స్‌.. పాయింట్ల పట్టికలో (6 పాయింట్లు) రెండో స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది.

4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన సీయాటిల్‌ ఆర్కాస్‌ టేబుల్‌ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన వాషింగ్టన్‌ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. నాలుగో బెర్త్‌ కోసం ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ (4), శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ (4) పోటీపడుతుండగా.. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌ (2) లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన యునికార్న్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), చైతన్య బిష్ణోయ్‌ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)  రాణించగా.. స్టోయినిస్‌ (13), షాదాబ్‌ ఖాన్‌ (20), కోరె ఆండర్సన్‌ (14), కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (19) రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో గెరాల్డ్‌ కొయెట్జీ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్‌ సామ్స్‌, మిచెల్‌ సాంట్నర్‌ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసిన డేనియల్‌ సామ్స్‌..
తొలుత బంతితో రాణించిన సామ్స్‌ (2/47) ఆతర్వాత బ్యాట్‌తోనూ మెరిశాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 42 పరుగులు చేసిన సామ్స్‌ సూపర్‌కింగ్స్‌ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 172 పరుగుల లక్ష్య ఛేదనలో సామ్స్‌తో పాటు సూపర్‌కింగ్స్‌ ఆటగాళ్లు డెవాన్‌ కాన్వే (30), మిలింద్‌ కుమార్‌ (52) కూడా రాణించారు.

సామ్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా సూపర్‌ కింగ్స్‌ మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. యునికార్న్స్‌ బౌలర్లలో  హరీస్‌ రౌఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు.. రోక్స్‌, ప్లంకెట్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)