Breaking News

MLC 2023: 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అరాచకం! కానీ పాపం పూరన్‌కు మాత్రం..

Published on Mon, 07/31/2023 - 10:58

Major League Cricket 2023- Seattle Orcas vs MI New York, Final: మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2023 ఫైనల్లో ఎంఐ న్యూయార్క్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చెమటలు పట్టించాడు. సీటెల్‌ ఓర్కాస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. డల్లాస్‌లో జరిగిన లీగ్‌ తుదిపోరులో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న పూరన్‌ అజేయ సెంచరీ(137)తో మెరిశాడు.

పరుగుల సునామీ
ఏకంగా.. 249.09 స్ట్రైక్‌రేటుతో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ వెస్టిండీస్‌ బ్యాటర్‌ అద్భుత ఆట తీరు కారణంగా ముంబై ఇండియన్స్‌ జట్టు ఎంఐ న్యూయార్క్‌.. ఎంఎల్‌సీ(MLC) అరంగేట్ర ఎడిషన్‌ విజేతగా అవతరించింది. సీటెల్‌ ఓర్కాస్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

అయితే, నికోలస్‌ పూరన్‌ ఇన్నింగ్స్‌.. అతడి రికార్డులకు జమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ టీ20 లీగ్‌ను యూఎస్‌ఏ నిర్వహిస్తోంది. ఇక యూఎస్‌ఏ అసోసియేట్‌ మెంబర్‌ మాత్రమే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిబంధనల ప్రకారం.. మేజర్‌ క్రికెట్‌ లీగ్‌కు అధికారిక (టీ20) హోదా ఉండదు. 

అయ్యో పాపం.. నామమాత్రం
ఈ నేపథ్యంలో నికోలస్‌ పూరన్‌ అజేయ అద్భుత శతకాన్ని ఓ మరుపురాని ఇన్నింగ్స్‌గా గుర్తుపెట్టుకోవడమే తప్ప.. అతడి రికార్డుల్లో దీనికి ఎటువంటి స్థానం ఉండదు. కాగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు భాగమైన ఎంఎల్‌సీలో మొత్తంగా ఆరు జట్లు ఉన్నాయి.

ఆరు జట్ల మధ్య పోటీ
జూలై 13న మొదలైన ఈ టీ20 లీగ్‌లో లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌, ఎంఐ న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్‌ ఓర్కాస్‌, టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌, వాషింగ్టన్‌ ఫ్రీడం పేరిట ఆరు టీమ్‌లు పాల్గొన్నాయి. ఈ క్రమంలో జూలై 30 నాటి ఫైనల్లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ న్యూయార్క్‌ ఫైనల్లో సీటెల్‌ను ఓడించి తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంఐ జట్టుకు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నికోలస్‌ పూరన్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)