Breaking News

ఇదేమి సిక్స్‌రా బాబు.. ఏకంగా స్టేడియం బయటకు! వీడియో వైరల్‌

Published on Mon, 07/17/2023 - 09:56

మేజర్ లీగ్ క్రికెట్‌-2023లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. 163 లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగల్గింది. సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో( 39 బంతుల్లో 76) మెరుపులు మెరిపించనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.

కెప్టెన్‌ డుప్లెసిస్‌, డెవాన్‌ కాన్వే వంటి టాపర్డర్‌ బ్యాటర్ల విఫలం కావడంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సూపర్‌ కింగ్స్‌ కష్టాల్లోపడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రావో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్‌లో సూపర్‌ కింగ్స్‌ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. బ్రావో 20 పరుగులు రాబట్టాడు.

దీంతో 6 పరుగల తేడాతో సూపర్‌ కింగ్స్‌ ఓటమి చవిచూడల్సి వచ్చింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన  వాషింగ్టన్ ఫ్రీడమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌ ఇన్నింగ్స్‌లో మథ్యూ షార్ట్‌ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ఆడాడు.  సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ రెండు వికెట్లు సాధించగా.. బ్రావో, శాంట్నర్‌, మోహ్సిన్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

బ్రావో సూపర్‌ సిక్సర్‌..
ఇక ఈ మ్యాచ్‌లో డ్వేన్‌ బ్రావో ఓ భారీ సిక్సర్‌ బాదాడు. ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో.. బ్రావో 103 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు. నోర్జే షార్ట్‌పిచ్‌ డెలివరీ వేయగా.. బ్రావో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. బంతి కాస్త స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: IND vs WI: వెస్టిండీస్‌కు వెళ్లనున్న అజిత్‌ అగర్కార్‌.. ఎందుకంటే?

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)