Breaking News

మ్యాచ్‌ జరుగుతుండగా గుండెపోటు.. రంజీ క్రికెటర్‌ హఠాన్మరణం

Published on Thu, 01/08/2026 - 20:08

భార‌త క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిజోరంకు చెందిన‌ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ కె. లాల్రెమ్రుటా (38) గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం ధ్రువీకరించింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు సమీపంలోని సిహ్ముయ్‌లో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్ జరుగుతోంది.

ఈ టోర్నీలో వెంగ్‌నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన లాల్రెమ్రుటా.. గురువారం చాన్‌పుయ్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లాల్రెమ్రుటా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లాల్రెమ్రుటా మృతి పట్ల  క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

"లాల్రెమ్రుటా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్‌లలో తన ప్రతిభను చాటుకున్నాడు.

మిజోరం ఒక గొప్ప క్రికెటర్‌ను కోల్పోయింది. లాల్రెమ్రుటా కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము" అని సీఏఎం ఒక ప్రకటనలో పేర్కొంది. మిజోరం క్రీడా శాఖా మంత్రి లాల్‌గింగ్లోవాహ్మర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చదవండి: IPL 2026: ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)