Breaking News

యూకీ జోడీ సంచలనం

Published on Fri, 02/21/2025 - 04:38

దోహా: ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో భారత డబుల్స్‌ స్టార్స్‌ యూకీ బాంబ్రీ, రోహన్‌ బోపన్నలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జోడీ ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జంటను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్‌ బోపన్న (భారత్‌)–నునో బోరెజెస్‌ (పోర్చుగల్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లో ఇంటిదారి పట్టింది. 

ప్రపంచ నంబర్‌వన్‌ జంట మార్సెలో అరెవాలో (ఎల్‌ సాల్వడార్‌)–మాట్‌ పావిక్‌ (క్రొయేషియా)లతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో యూకీ–డోడిగ్‌ 2–6, 6–3, 10–8తో విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–డోడిగ్‌ ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. 

అయితే ‘సూపర్‌ టైబ్రేక్‌’లో యూకీ–డోడిగ్‌ ద్వయం పైచేయి సాధించింది. జూలియన్‌ క్యాష్‌–లాయిడ్‌ గ్లాస్‌పూల్‌ (బ్రిటన్‌)లతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–బోర్జెస్‌ 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఓటమి పాలయ్యారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)