Breaking News

టాప్‌–5లో రౌనక్, హారిక

Published on Sat, 12/28/2024 - 04:02

న్యూయార్క్‌: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఓపెన్‌ విభాగంలో భారత్‌ నుంచి 9 మంది గ్రాండ్‌మాస్టర్లు... మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్నారు. తొలి రోజు ఓపెన్‌ విభాగంలో 5 రౌండ్‌ గేమ్‌లు... మహిళల విభాగంలో 4 రౌండ్‌ గేమ్‌లు జరిగాయి. ఐదు రౌండ్‌లు ముగిశాక ఓపెన్‌ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ రౌనక్‌ సాధ్వాని 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. 

భారత్‌కే చెందిన ఇరిగేశి అర్జున్‌ 4 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో, ప్రణవ్‌ 3.5 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 3 పాయింట్లతో 56వ ర్యాంక్‌లో, దీప్తాయన్‌ ఘోష్‌ 3 పాయింట్లతో 69వ ర్యాంక్‌లో, హర్ష భరతకోటి 2 పాయింట్లతో 108వ ర్యాంక్‌లో, అరవింద్‌ చిదంబరం 2 పాయింట్లతో 120వ ర్యాంక్‌లో, కార్తీక్‌ వెంకటరామన్‌ 1.5 పాయింట్లతో 144వ ర్యాంక్‌లో, 1.5 పాయింట్లతో 156వ ర్యాంక్‌లో ఉన్నారు. ప్లేయర్ల పాయింట్లు సమంగా ఉంటే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరిస్తున్నారు. 

హెల్గీ గ్రేటర్‌సన్‌ (ఐస్‌లాండ్‌), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌), షాంగ్లీ లు (చైనా)లపై గెలిచిన రౌనక్‌... సామ్యూల్‌ సెవియన్‌ (అమెరికా), రే రాబ్సన్‌ (అమెరికా)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. డేవిడ్‌ బ్రాడ్‌స్కయ్‌ (అమెరికా), విక్టర్‌ బోలోగన్‌ (మాల్డొవా), ఫిడేల్‌ జిమెనెజ్‌ (అమెరికా), ఎల్తాజ్‌ సఫార్లీ (అజర్‌బైజాన్‌)లపై గెలిచిన అర్జున్‌... సామ్యూల్‌ సెవియన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 

మహిళల విభాగంలో నాలుగు రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఇనా అగ్‌రెస్ట్‌ (స్వీడన్‌), నటాలియా జుకోవా (ఉక్రెయిన్‌), ఉల్వియా ఫతాలియెవా (అజర్‌బైజాన్‌)లపై నెగ్గిన హారిక... టియోడోరా ఇన్‌జాక్‌ (సెర్బియా)తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. 

భారత్‌కే చెందిన వైశాలి 3 పాయింట్లతో 15వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్‌ 2.5 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 2.5 పాయింట్లతో 38వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 2 పాయింట్లతో 57వ ర్యాంక్‌లో, నూతక్కి ప్రియాంక 2 పాయింట్లతో 61వ ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్‌ 2 పాయింట్లతో 70వ ర్యాంక్‌లో, పద్మిని రౌత్‌ 1.5 పాయింట్లతో 78వ ర్యాంక్‌లో ఉన్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)