Breaking News

IPL 2024: అప్పట్లో ఆర్సీబీకి.. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ! కారణం తెలిస్తే..

Published on Thu, 09/07/2023 - 12:55

Mitchell Starc Eyes IPL Return In 2024: ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్‌-2024కు తప్పక అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.

ఆర్సీబీకి ప్రాతినిథ్యం
కాగా 2014 ఎడిషన్‌ సందర్భంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్క్‌.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీశాడు. మరుసటి ఏడాదిలోనే ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. మొత్తంగా ఈ టీ20 లీగ్‌లో 27 మ్యాచ్‌లలో కలిపి 34 వికెట్లతో రాణించాడు.

ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్‌ రీఎంట్రీ
కాగా, 2018లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని కొనుగోలు చేసినప్పటికీ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కే తన ప్రాధాన్యం అంటూ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సుమారు ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు స్టార్క్‌ సిద్ధపడుతున్నాడు.

అయితే, దీని వెనుక పెద్ద మాస్టర్‌ ప్లానే ఉంది మరి! టీ20 ప్రపంచకప్‌-2024 సన్నాహకాల్లో భాగంగా స్టార్క్‌ మళ్లీ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతడే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ..

అసలు విషయం అదీ!
‘‘ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. వచ్చే ఏడాది కచ్చితంగా తిరిగి వస్తా. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇది నాకెంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఐసీసీ టోర్నీకి ముందు ఇలాంటి అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు’’ అని మిచెల్‌ స్టార్క్‌ పేర్కొన్నాడు. 

డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా స్టార్క్‌ భార్య
కాగా ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు 82 టెస్టులు, 110 వన్డేలు, 58 టీ20లు ఆడిన స్టార్క్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 333, 219, 73 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. స్టార్క్‌ భార్య, ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ భార్య అలిసా హేలీ వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే.

మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో యూపీ వారియర్స్‌ జట్టుకు ఆమె కెప్టెన్‌గా ఎంపికైంది. రూ. 70 లక్షలతో యూపీ ఫ్రాంఛైజీ హేలీని కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే... ప్రపంచకప్‌-2023 టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిచెల్‌ స్టార్క్‌ స్థానం దక్కించుకున్నాడు.

చదవండి: సిగ్గుపడు రోహిత్‌! నువ్వసలు కెప్టెన్‌వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు!
వరల్డ్‌కప్‌ తర్వాత ద్రవిడ్‌ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే?

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)