Breaking News

నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ

Published on Thu, 07/06/2023 - 20:28

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లీడ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన మార్ష్‌ కేవలం 102 బంతుల్లోనే శతకం సాధించడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన ఆసీస్‌.. మార్ష్‌ ఇన్నింగ్స్‌తో కోలుకున్నట్లగా కనిపిస్తోంది.

మార్ష్‌కు..  ట్రెవిస్‌ హెడ్‌ (39 బ్యాటింగ్‌) అండగా నిలబడ్డాడు. చివరికి 118 బంతుల్లో 118 పరుగులు చేసిన మార్ష్‌ క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో జాక్‌ క్రాలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో సూపర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇక మిచెల్‌ మార్ష్‌ నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు.

2019 యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఆఖరిసారిగా ఆడాడు. మళ్లీ తాజాగా యాషెస్‌తోనే ఎంట్రీ ఇచ్చిన మార్ష్‌ పునరగమనాన్ని ఘనంగా చాటాడు. కామెరున్‌ గ్రీన్‌ గాయపడడంతో మూడో టెస్టుకు జట్టులోకి వచ్చిన మార్ష్‌  ఏకంగా సెంచరీతో మెరిశాడు. మార్ష్‌ కెరీర్‌లో ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం.

చదవండి: #MarkWood: యాషెస్‌ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్‌ బంతి.. ఖవాజాకు మైండ్‌ బ్లాక్‌

#SteveSmith: వందో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డు

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు