Breaking News

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం

Published on Fri, 01/31/2025 - 12:13

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)కి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వెన్ను గాయం కార‌ణంగా ఈ ఐసీసీ మెగా టోర్నీకి దూర‌మయ్యాడు. ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఆసీస్ సెల‌క్ట‌ర్లు ఎంపిక చేసిన జ‌ట్టులో మార్ష్‌కు చోటు ద‌క్కింది. ఇప్పుడు అత‌డి స్ధానాన్ని మ‌రో ఆల్‌రౌండ‌ర్‌తో సెల‌క్ట‌ర్లు భ‌ర్తీ చేయ‌నున్నారు.

స్వ‌దేశంలో భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్ ఆరంభంలోనే త‌ను వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాని క్రికెట్ ఆస్ట్రేలియాకు మార్ష్ తెలియ‌జేశాడు. దీంతో అతడిపై ఎక్కువ బౌలింగ్ లోడ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ ఉంచ‌లేదు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మార్ష్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 73 పరుగులు చేశాడు. దీంతో సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టెస్టుకు టీమ్ మెనెజ్‌మెంట్ అత‌డిపై వేటు వేసింది. అత‌డి స్ధానంలో బ్యూ వెబ్‌స్టార్‌కు చోటు ఇచ్చాడు. ఈ టాల్ ఆల్‌రౌండ‌ర్ త‌న అరంగేట్రంలోనే ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత బిగ్‌బాష్‌లోకి వెళ్లిన మార్ష్ కేవ‌లం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోలుకోవడానికి  బిగ్‌బాష్ లీగ్ చివరి మూడు మ్యాచ్‌ల‌ను మార్ష్ దాటేశాడు. అయిన‌ప్ప‌టికి అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు.

"మిచెల్ మార్ష్ వెన్ను నొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవల కాలంలో అతడి నడుము నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని ఆస్ట్రేలియా సెలక్షన్ ప్యానల్ నిర్ణయించింది. అతడు కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టనున్నట్లు" క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా మార్ష్‌​ ఐపీఎల్‌​ ఫస్ట్‌హాఫ్‌కు కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. కాగా మార్ష్ స్ధానాన్ని వెబ్‌స్టెర్‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశ‌ముంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆసీస్‌ జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
చదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్‌! దారుణ వైఫల్యం
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)