Breaking News

మిచెల్ మార్ష్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Published on Tue, 12/09/2025 - 10:51

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆసీస్‌ దేశవాళీ డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సీజ‌న్ అనంత‌రం ఫ‌స్ట్-క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు మార్ష్ తెలిపాడు.

డొమాస్టిక్ క్రికెట్‌లో మార్ష్ వెస్ట్ర‌న్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. అయితే ఫ‌స్ట్ క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి జాతీయ జ‌ట్టు త‌ర‌పున టెస్టు క్రికెట్ ఆడేందుకు మాత్రం సిద్దంగా ఉన్నాన‌ని మిచెల్ స్ప‌ష్టం చేశాడు.

"ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. పెర్త్ స్కార్చర్స్,  వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో నా ప్ర‌యాణం ఒక అద్భుతం. భ‌విష్య‌త్తులో కూడా డబ్ల్యూఏ కోసం ఏమి చేయ‌డానికైనా సిద్ద‌మ‌ని" ఓ ప్రకటనలో మార్ష్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌కు మార్ష్ నాయకత్వం వహిస్తున్నాడు. పెర్త్ స్కార్చర్స్ యాజమాన్యంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ కూడా భాగంగా ఉంది.

"వైట్‌బాల్ క్రికెట్‌లో తనను నిరూపించుకున్న మార్ష్‌.. టెస్టుల్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. దాదాపు నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న  2023 యాషెస్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. తన పునరాగమన మ్యాచ్‌లో సెంచరీ చేసి దుమ్ములేపాడు. 

ఆ తర్వాత అతడు తన ఫామ్‌ను కోల్పోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మార్ష్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది. అతడు చివరగా గతేడాది డిసెంబర్‌లో భారత్‌పై చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. షెఫీల్డ్ షీల్డ్‌లో మార్ష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 2744 పరుగులతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు
చదవండి: Ashes Test series: ఆస్ట్రేలియాకు ఓ గుడ్‌ న్యూస్‌.. ఓ బ్యాడ్‌ న్యూస్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)