Breaking News

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌గా మిచెల్‌ మార్ష్‌.. ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ

Published on Mon, 08/07/2023 - 13:04

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 14 మంంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ను కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. టీ20ల్లో ఆస్ట్రేలియా సారధి ఎంపికైన 12వ ఆటగాడిగా మార్ష్‌ నిలిచాడు. కాగా టెస్టులు, వన్డేల్లో ఆసీస్‌ జట్టుకు ప్యాట్‌ కమ్మిన్స్‌ సారథ్యం వహిస్తుండగా.. టీ20ల్లో మాత్రం శాశ్వత కెప్టెన్‌ లేడు. ఈ ఏడాది ఆరంభంలో ఆరోన్‌ ఫించ్‌ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక క్రికెట్‌ ఆస్ట్రేలియా అతడి స్ధానాన్ని ఇంకా భర్తీ చేయలేదు.

అయితే టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు మార్ష్‌ను టీ20ల్లో తమ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా క్రికెట్‌ ఆస్ట్రేలియా నియమించే ఛాన్స్‌ ఉంది. కాగా మార్ష్‌ మూడు ఫార్మాట్లలో కూడా కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే జరిగిన యాషెస్‌ సిరీస్‌లో కూడా అతడు అద్బుతమైన ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 50 సగటుతో 250 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది.

ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ!
ఇక ప్రోటీస్‌ సిరీస్‌తో ముగ్గురు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ స్పెన్సర్ జాన్సన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌  ఆరోన్ హార్డీ , మాథ్యూ షార్ట్‌లకు తొలిసారి ఆసీస్‌ జట్టులో చోటు దక్కింది. ఆరోన్ హార్డీ వన్డే ప్రపంచకప్-2023కు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్రాథమిక జట్టులో కూడా ఛాన్స్‌ లభించింది.

ప్రోటీస్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
చదవండిఅస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)