Breaking News

టీమిండియాతో వన్డే సిరీస్‌.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!

Published on Sun, 08/06/2023 - 10:30

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ దూరం కానునున్నట్లు సమాచారం. మణికట్టు గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్‌.. దక్షిణాఫ్రికా, భారత పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు ఆఖరి వారంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ప్రోటీస్‌తో మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసీస్‌ తలపడనుంది.

కంగారు జట్టు ప్రోటీస్‌ టూర్‌ ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్‌ 17న ముగియనుంది. అనంతరం ఆస్ట్రేలియా నేరుగా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చేరుకోనుంది. అతిథ్య భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ తలపడనుంది. సెప్టెంబర్‌ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక రెండు పర్యటనలకు దూరంగా ఉండనున్న కమ్మిన్స్‌.. తిరిగి మళ్లీ వరల్డ్‌కప్‌కు అందుబాటులో రానున్నట్లు సమాచారం.

కెప్టెన్‌గా మిచెల్‌ మార్ష్‌..
ఇక దక్షిణాఫ్రికా, భారత పర్యటనలలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్‌ గైర్హజరీ నేపథ్యంలో అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆస్ట్రేలియా క్రికెట్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్ష్‌ గత కొంత కాలంగా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్‌లలో ఆసీస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన ఆటతో పాటు కెప్టెన్సీ చేసే సత్తా కూడా ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లో పెర్త్‌స్కార్చర్స్‌ కెప్టెన్‌గా మార్ష్‌ వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

కాగా టెస్టులు, వన్డేల్లో ఆసీస్‌ జట్టుకు ప్యాట్‌ కమ్మిన్స్‌ సారథ్యం వహిస్తుండగా.. టీ20ల్లో మాత్రం కంగారు జట్టుకు శాశ్వత కెప్టెన్‌ లేడు. ఈ ఏడాది ఆరంభంలో ఆరోన్‌ ఫించ్‌ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక క్రికెట్‌ ఆస్ట్రేలియా అతడి స్ధానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. ఈ క్రమంలో మిచిల్‌ మార్ష్‌ ఆసీస్ టీ20 కెప్టెన్ రేసులో అందరి కంటే ముందున్నాడు. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
చదవండి: Asia cup 2023: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు!


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)