Breaking News

IPL 2023: వైరలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ పెళ్లి ఫోటోలు

Published on Mon, 04/10/2023 - 16:37

Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ మిచెల్ మార్ష్ ఇటీవలే తన లాంగ్‌ టర్మ్‌ పార్ట్‌నర్‌ గ్రెటా మాక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గ్రేస్‌టౌన్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో  వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది. వివాహ వేడుకలో మార్ష్ బ్లాక్ కలర్‌ సూట్‌లో మెరిసిపోగా.. మాక్, సంప్రదాయ తెల్లని గౌనులో తళుక్కుమంది. నూతన వధూవరులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. 

కాగా, పెళ్లి నిమిత్తం మార్ష్‌ ఐపీఎల్‌-2023 మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు మార్ష్‌ అందుబాటులో లేడు. డీసీ ఆడబోయే మరో 3, 4 మ్యాచ్‌లకు మార్ష్‌ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మార్ష్‌ గైర్హాజరీలో డీసీ రోవ్‌మన్‌ పావెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను దారుణంగా నిరాశపరిచాడు. దీంతో మార్ష్‌ లేని లోటు డీసీ శిబిరంలో స్పష్టంగా కనిపించింది.

ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 11న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తలపడబోయే ఇరు జట్లు ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్‌ ఆడిన 2 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

ఈ నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్‌ను ఇరు జట్లు చాలా సీరియస్‌గా తీసుకోనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)