Breaking News

ల‌క్నోకు గుడ్ న్యూస్.. విధ్వంస‌క‌ర వీరుడు వ‌చ్చేస్తున్నాడు?

Published on Thu, 03/13/2025 - 16:11

ఐపీఎల్-2025 సీజ‌న్‌కు ముందు ల‌క్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది.  వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ మిచెల్ మార్ష్ త‌న గాయం నుంచి కోలుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య‌బృందం నుంచి మార్ష్‌ క్లియరెన్స్ పొందాడు. 33 ఏళ్ల మార్ష్ వెన్ను గాయం కార‌ణంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు దూర‌మ‌య్యాడు.

ఈ క్రమంలో నెల రోజుల పాటు ​‍క్రికెట్ ఆస్ట్రేలియా రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపిన మార్ష్ తిరిగి తన ఫిట్‌నెస్‌ను పొందాడు. అయితే మార్ష్ ఈ ఏడాది సీజన్‌లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచనల మేరకు కొన్నాళ్లపాటు మార్ష్ బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు.

బౌలింగ్‌ చేసే క్రమంలో వెన్నెముకపై ఎక్కువగా ఒత్తిడి పడే అవకాశమున్నందన బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యలు సూచించినట్లు ఈఎస్పీఎన్‌ తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అతడిని లక్నో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉపయెగించుకునే అవకాశముంది.

కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో మార్ష్‌ను రూ.3.3 కోట్ల‌కు ల‌క్నో కొనుగోలు చేసింది. త్వరలోనే లక్నో జట్టుతో మార్ష్‌ కలవనున్నాడు. కెప్టెన్ రిష‌బ్ పంత్‌, నికోల‌స్ పూర‌న్, మిల్ల‌ర్‌ వంటి విధ్వంస‌క‌ర ఆట‌గాళ్ల‌తో మార్ష్ ఆడ‌నున్నాడు. గ‌త రెండు సీజ‌న్ల‌లో మార్ష్‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. మెగా వేలానికి ముందు అత‌డిని ఢిల్లీ విడిచిపెట్టింది.

ఇక ఐపీఎల్‌-18 సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌,రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఇక మార్ష్‌తో పాటు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ సైతం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించారు. త్వరలోనే ఈ ఆసీస్‌ ఆటగాళ్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో కలవనున్నారు.

 ఐపీఎల్‌-2025కు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్:
డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్‌రమ్, హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కీ, ఆర్యన్ జుయల్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరీ, అబ్దుల్ సమద్, రాజవర్దన్ హంగార్గేకర్, అర్శిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్.
చదవండి: IPL 2025: ముంబై ఇండియ‌న్స్ కీల‌క నిర్ణ‌యం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలిసారి
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)