Breaking News

భారత్‌ ‘ఎ’ 184 ఆలౌట్‌

Published on Sat, 08/24/2024 - 04:02

గోల్డ్‌కోస్ట్‌: మరోసారి బౌలర్లు రాణించడంతో... ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టుపై భారత ‘ఎ’ మహిళల జట్టు పట్టు కోల్పోలేదు. 28 పరుగుల స్వల్ప ఆధిక్యం పొందిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 

ప్రస్తుతం ఆ్రస్టేలియా ‘ఎ’ ఓవరాల్‌ ఆధిక్యం 192 పరుగులకు చేరుకుంది. మ్యాడీ డార్క్‌ (54 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), లిల్లీ మిల్స్‌ (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన భారత ‘ఎ’ జట్టు కెప్టెన్, ఆఫ్‌ స్పిన్నర్‌ మిన్ను మణి రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకుంది. మిన్ను 20 ఓవర్లలో 6 మెయిడెన్లు వేసి 47 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 

ప్రియా మిశ్రా, సయాలీలకు ఒక్కో వికెట్‌ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 100/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత ‘ఎ’ జట్టు మరో 84 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లను కోల్పోయింది. శ్వేత సెహ్రావత్‌ (40; 3 ఫోర్లు), తేజల్‌ హసాబ్నిస్‌ (32; 2 ఫోర్లు), సయాలీ (21; 2 ఫోర్లు) రాణించారు.   
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)