Breaking News

చ‌రిత్ర సృష్టించిన శ్రీలంక ఆటగాడు.. 41 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

Published on Thu, 08/22/2024 - 16:12

మాంచెస్టర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక అరంగేట్ర ఆట‌గాడు మిలన్‌ రత్నాయకే స‌త్తాచాటాడు. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన ఈ యువ ఆట‌గాడు త‌న అద్భుత ఇన్నింగ్స్‌తో అదుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో 135 బంతులు ఎదుర్కొన్న రత్నాయకే .. 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 72 ప‌రుగులు సాధించాడు. ఇక త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టిన రత్నాయకే ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. 

టెస్టు క్రికెట్ చరిత్రలోనే డెబ్యూ మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరుపరుగులు చేసిన ఆటగాడిగా రత్నాయ‌కే రికార్డుల‌కెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్‌ బల్వీందర్ సంధు పేరిట ఉండేది. 

బల్వీందర్ 1983లో పాకిస్థాన్‌పై 71 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 41 ఏళ్ల బల్వీందర్ సంధు రికార్డును రత్నాయకే బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 236 పరుగులకే ఆలౌటైంది. 

శ్రీలంక బ్యాటర్లలో రత్నాయ‌కే(72)తో పాటు కెప్టెన్ దనుంజయ డిసిల్వా(74) పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ డకెట్ (13), డేనియల్ లారెన్స్ (9) ఉన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)