Breaking News

ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్‌

Published on Wed, 10/02/2024 - 13:51

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యం సాధించింది. కేవ‌లం మూడు రోజుల పాటు జ‌రిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌తో బంగ్లాను భార‌త్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది. 

దీంతో భార‌త జ‌ట్టుపై స‌ర్వాత్ర ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కానీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం మ‌రోసారి టీమిండియాపై త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కాడు. ఇంగ్లండ్ బ్రాండ్ క్రికెట్  'బాజ్‌బాల్‌ను భార‌త్ కాపీ చేసిందని వాన్ ఆరోపించాడు.

నిజంగా ఇదొక అద్భుత‌మైన టెస్టు మ్యాచ్‌. నాలుగో రోజు ఆట‌లో భార‌త్ బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టింది. భార‌త క్రికెట‌ర్లు బాజ్‌బాల‌ర్స్‌గా మార‌డం గొప్ప విష‌యం. కేవ‌లం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఇంగ్లండ్ బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ కొట్టారు' అని ఓ క్రికెట్ షోలో వాన్ పేర్కొన్నాడు. అయితే ఇదే షోకు కో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆసీస్ దిగ్గ‌జం ఆడ‌మ్ గిల్ క్రిస్ట్ వాన్‌కు కౌంటిరిచ్చాడు.

"వాన్ నీవు బాగానే ఉన్నావా?  భార‌త్ ఆడింది బజ్‌బాల్ కాదు.. గాంబాల్‌. వారి హెడ్‌కోచ్ గంభీర్ ఇప్ప‌టికే గాంబాల్‌పై పేటెంట్ పొందాడు. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి" అని గిల్లీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇందుకు స్పందించిన వాన్‌.. భార‌త్ గాంబాల్ అచ్చెం బజ్‌బాల్ లానే ఉందంటూ చెప్పుకొచ్చాడు. 

వర్షం కారణంగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయిన తర్వాత నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. టీ20లను తలపిస్తూ కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది.
చదవండి: IND-W vs SA_W: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)