Breaking News

ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిని సంధించిన ముంబై పేస్‌ గన్‌

Published on Tue, 04/02/2024 - 11:07

ముంబై ఇండియన్స్‌ పేస్‌ గన్‌ గెరాల్డ్‌ కొయెట్జీ 2024 ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 1) జరిగిన మ్యాచ్‌లో కొయెట్జీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. రియాన్‌ పరాగ్‌ ఎదుర్కొన్న మ్యాచ్‌ చివరి బంతిని కొయెట్జీ రికార్డు స్థాయిలో 157.4 కిమీ వేగంతో బౌల్‌ చేశాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత​ వేగవంతమైన బంతిగా రికార్డైంది.

సరిగ్గా రెండు రోజుల ముందు లక్నో పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ డెలివరీని సంధించాడు. పంజాబ్‌తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లోనే మయాంక్‌ రికార్డు స్థాయిలో 155.8 కిమీ వేగంతో బంతిని వేశాడు. తాజాగా కొయెట్జీ మయాంక్‌ వేగాన్ని అధిగమించి ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంతి ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిగానూ రికార్డుల్లోకెక్కింది. కొయెట్జీ సంధించిన ఈ సీజన్‌ వేగవంతమైన బంతిని రియాన్‌ పరాగ్‌ బౌండరీకి తరలించి మ్యాచ్‌ను గెలిపించడం కొసమెరుపు.

కాగా, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. ముంబైకు హ్యాట్రిక్‌ పరాజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై చెత్త ప్రదర్శనను కనబర్చి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ముంబై ఇన్నింగ్స్‌లో రోహిత్‌ సహా ముగ్గురు (నమన్‌ ధీర్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌) గోల్డెన్‌ డకౌట్లయ్యారు. తిలక్‌ వర్మ (32), హార్దిక్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్‌ (4-0-22-3), చహల్‌ (4-0-11-3), బర్గర్‌ (4-0-32-2), ఆవేశ్‌ ఖాన్‌ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ముంబైని వణికించారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్‌ పరాగ్‌ (54 నాటౌట్‌) మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి రాజస్థాన్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్‌ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్‌ 12, అశ్విన్‌ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్‌ మధ్వాల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్‌ వికెట్‌ దక్కించుకున్నాడు.  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)