Breaking News

ఆర్చర్‌ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే.. అగమ్యగోచరంగా ముంబై ఇండియన్స్‌ పరిస్థితి

Published on Sun, 04/16/2023 - 13:08

ఐపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 16) జరుగనున్న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడేలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. కేకేఆర్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించగా.. ముంబై 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. 

తొలి రెండు మ్యాచ్‌ల్లో (ఆర్సీబీ, సీఎస్‌కే) ఘోర పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడినట్లు కనిపిస్తున్న ముంబై టీమ్‌కు రిలాక్స్‌ అయ్యే లోపే మరో షాక్‌ తగిలింది. తొలి మ్యాచ్‌ సందర్భంగా గాయపడి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ కేకేఆర్‌తో మ్యాచ్‌కు సైతం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు.

కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్‌ సంసిద్దతపై అతని సహచరుడు టిమ్‌ డేవిడ్‌ ఓ క్లూ వదిలాడు. ఆర్చర్‌ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు టిమ్‌ తెలిపాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్‌ అందుబాటులో ఉండేది లేనిది చివరి నిమిషం వరకు చెప్పలేమని పేర్కొన్నాడు. శనివారం ఆర్చర్‌ కొద్దిసేపు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడని, అనంతరం నెట్స్‌లో భారీ షాట్లు సైతం ఆడాడని, అయినా ఇదంతా అతను మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షనలో చేస్తుండటం కొంత ఆందోళనకరమేనని చెప్పుకొచ్చాడు.

మరోవైపు పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన కేకేఆర్‌ను ఢీకొనడం పెద్ద ఛాలెంజ్‌తో కూడుకున్న పని అని, ఇలాంటి ప్రత్యర్ధిపై బలమైన బౌలింగ్‌ ఆప్షన్స్‌ లేకపోత చాలా కష్టమవుతుందని తెలిపాడు. గత 3 మ్యాచ్‌ల్లో 200 ప్లస్‌ స్కోర్‌ చేసిన కేకేఆర్‌ను నిలువరించాలంటే తమ బౌలింగ్‌ పటిష్టంగా ఉండాలని, మ్యాచ్‌ సమయానికి ఆర్చర్‌ అందుబాటులోకి వస్తే, తమ విజయావకాశాలు మెరుగవుతాయని అన్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణాలను నిలువరించడం తమకు కత్తి మీద సామే అవుతుందని పేర్కొన్నాడు.


  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)