ముంబై ఇండియ‌న్స్‌లోకి విధ్వంస‌క‌ర వీరుడు

Published on Thu, 11/13/2025 - 20:07

ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందే ఐదు సార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్ల బెస్ ప్రెస్‌కు ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్‌.. ఇప్పుడు మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథ‌ర్ ఫ‌ర్డ్‌ను ముంబై ఇండియ‌న్స్ ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదిక‌గా ధ్రువీక‌రించింది.

కాగా  గ‌త సీజ‌న్ వేలంలో రూథ‌ర్ ఫ‌ర్డ్‌ను రూ. 2.6 కోట్ల‌కు గుజ‌రాత్ కొనుగోలు చేసింది. ఈ కరేబియ‌న్ ఆట‌గాడు ఇప్పుడు అదే ప్రైస్ ట్యాగ్‌తో ముంబైకి మారాడు. ఐపీఎల్‌-2025లో రూథ‌ర్ ఫ‌ర్డ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికి గుజ‌రాత్ అత‌డిని ట్రేడ్ చేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇప్ప‌టికే న‌మ‌న్ ధీర్ వంటి సూప‌ర్ ఫినిష‌ర్ ఉండ‌డంతో రూథ‌ర్‌ఫ‌ర్డ్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఉపయోగించుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

27 ఏళ్ల షెర్ఫేన్ రూథ‌ర్‌ఫ‌ర్డ్ విండీస్ త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు వెస్టిండీస్ త‌ర‌పున 44 టీ20లు ఆడాడు. ఆండ్రీ రస్సెల్‌తో క‌లిసి టీ20ల్లో ఆరో వికెట్‌కు అత్య‌ధిక భాగ‌స్వామ్యం(139) నెలకొల్పిన రికార్డును అత‌డు క‌లిగి ఉన్నాడు. ఇక 2019 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన రూథ‌ర్ ఫ‌ర్డ్.. ఇప్ప‌టివ‌ర‌కు 23 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌-2020 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు కూడా అత‌డు ప్రాతినిథ్యం వ‌హించాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఆరేళ్ల త‌ర్వాత ముంబై త‌ర‌పున మ‌ళ్లీ ఆడ‌నున్నాడు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)