Breaking News

నైట్‌రైడ‌ర్స్‌ను చిత్తు చేసిన ఎంఐ న్యూయార్క్‌.. ప్లే ఆశ‌లు స‌జీవం

Published on Fri, 07/04/2025 - 14:21

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌-2025 టోర్నీలో ఎంఐ న్యూయ‌ర్క్(MI New York) త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకుంది. శుక్ర‌వారం ఫ్లోరిడా వేదిక‌గా లాసెంజెల్స్ నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూయ‌ర్క్ టీమ్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈమ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది. నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో షెర్ఫెన్ రూథ‌ర్‌ఫ‌ర్డ్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క‌రేబియ‌న్ ఆట‌గాడు 44 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 86 ప‌రుగులు చేశాడు.

ఓవైపు వికెట్లు పడుతున్నా రూథర్‌ఫోర్డ్‌ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. మిగితా నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. న్యూయ‌ర్క్ పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్  నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి నైట్‌రైడ‌ర్స్‌ను దెబ్బ‌తీశాడు. అత‌డితో పాటు పొలార్డ్ రెండు, ఇషాన్ అదిల్, కెంజిగె చెరో వికెట్ తీశారు. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని న్యూయర్క్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.

ఓపెనర్ మోనాంక్ పటేల్ (56), కెప్టెన్‌ నికోలస్ పూరన్ (62 నాటాట్‌) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.  నైట్‌రైడర్స్‌ బౌలర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు. ఎంఐ న్యూయర్క్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లో గెలిచి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా సీటెల్ ఓర్కాస్ టీమ్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడే పూరన్ సేన నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.

 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)