Breaking News

40 ఏళ్ల తర్వాత నాకౌట్‌ విజయం.. సంబరాల్లో మెక్సికో

Published on Wed, 07/01/2026 - 10:07

ఫిఫా వరల్డ్ కప్‌లో హోస్ట్ జట్టు మెక్సికో అద్భుత ప్రదర్శనతో 40 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఎస్టాడియో అజ్‌టెకాలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఈ జట్టు 2-0 గోల్స్‌ తేడాతో ఈక్వెడార్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ ఆవకాశాలను మెరుగుపర్చుకుంది.

ఆరంభం నుంచే దూకుడు.. 9 నిమిషాల్లో రెండు గోల్స్
వాతావరణం అనుకూలించని కారణంగా మ్యాచ్ ప్రారంభం గంట ఆలస్యమైనా, అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. హోమ్ క్రౌడ్ మద్దతుతో మెక్సికో మొదటి నుంచే ఆధిపత్యం చూపింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ నమోదయ్యాయి.

జూలియన్ క్వినోనెస్ అద్భుత గోల్‌తో ఖాతా తెరవగా.. వెంటనే రౌల్ జిమెనెజ్ రెండో గోల్‌తో ఆధిక్యం పెంచాడు.

మెక్సికో చివరిసారిగా 1986 ఎడిషన్‌లో బల్గేరియాపై నాకౌట్ విజయం సాధించింది. ఇప్పుడు అదే అజ్‌టెకా స్టేడియంలో, అదే స్కోర్‌లైన్‌తో మరోసారి నాకౌట్ గెలుపు నమోదు చేసింది. వరుసగా 7 నాకౌట్ పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం మెక్సికోకు భారీ ఊరట ఇచ్చింది.

ఈక్వెడార్‌కు నిరాశ
గ్రూప్ దశలో జర్మనీపై సంచలన విజయం సాధించి అనూహ్యంగా అంచనాలు పెంచుకున్న ఈక్వెడార్, ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. రెండో అర్ధభాగంలో పీరో హింకాపీ రెడ్ కార్డ్‌తో వైదొలగడంతో జట్టు 10 మందికే పరిమితమైంది.

తదుపరి పోరాటం ఎవరి‌తో..?
మెక్సికో క్వార్టర్ ఫైనల్ చేరేందుకు ఇంగ్లండ్ లేదా డీఆర్ కాంగోతో తలపడనుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే హోస్ట్ జట్టును అంచనా వేయడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)