మెస్సీ మ్యాజిక్‌...

Published on Thu, 10/17/2024 - 08:46

బ్యూనస్‌ ఎయిర్స్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా జట్టు 2026 ప్రపంచకప్‌ దక్షిణ అమెరికా జోన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఏడో విజయం నమోదు చేసింది. బొలీవియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. చీలమండ గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్, స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మొత్తం 90 నిమిషాలు ఆడిన 37 ఏళ్ల మెస్సీ తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు.

మూడు గోల్స్‌తో మెరిసిన మెస్సీ (19వ, 84వ, 86వ నిమిషాల్లో) సహచరులు లా మారి్టనెజ్‌ (43వ నిమిషంలో), జూలియన్‌ అల్వారెజ్‌ (45+3వ నిమిషంలో) గోల్స్‌ చేసేందుకు సహాయపడ్డాడు. మెస్సీ అందించిన పాస్‌లతో మారి్టనెజ్, అల్వారెజ్‌ గోల్స్‌ సాధించారు. అర్జెంటీనా తరఫున అల్మాదా (69వ నిమిషంలో) మరో గోల్‌ చేశాడు. 

మరో మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత బ్రెజిల్‌ 4–0 గోల్స్‌తో పెరూ జట్టును ఓడించింది. ఉరుగ్వే–ఈక్వెడార్‌ మ్యాచ్‌ 0–0తో ‘డ్రా’కాగా... పరాగ్వే 2–1తో వెనిజులాపై, కొలంబియా 4–0తో చిలీ జట్టుపై విజయం సాధించాయి. దక్షిణ అమెరికాకు చెందిన 10 దేశాలు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో పోటీపడుతున్న ఈ టోరీ్నలో అన్ని జట్లు 10 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. నిరీ్ణత 18 మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్‌–6లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్‌ టోరీ్నకి నేరుగా అర్హత సాధిస్తాయి. 2026 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోరీ్నకి కెనడా, అమెరికా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి.  

 

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)