Breaking News

శ్రీకాంత్‌ పరాజయం

Published on Thu, 11/23/2023 - 04:15

షెన్‌జెన్‌: చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్‌లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో 17వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్‌ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్‌ కెంటా నిషిమోటో (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్‌) ద్వయం 15–21, 9–21తో షు జియాన్‌ జాంగ్‌–యు జెంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)