Breaking News

37 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం

Published on Sat, 09/30/2023 - 02:16

అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు ఆసియా క్రీడల్లో 37 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

అత్యంత సులువైన ‘డ్రా’ పొందిన భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో నేపాల్‌ జట్టుపై 3–0తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ 21–5, 21–8తో ప్రిన్స్‌ దహాల్‌పై.. రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–4, 21–3తో సునీల్‌ జోషిపై.. మూడో సింగిల్స్‌లో మిథున్‌ మంజునాథ్‌ 21–2, 21–17తో బిష్ణు కతువాల్‌పై నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్‌ ఆడుతుంది.

భారత పురుషుల జట్టు ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో మూడుసార్లు సెమీఫైనల్లో ఓడిపోయి (టెహ్రాన్‌; 1974లో, న్యూఢిల్లీ; 1982లో, సియోల్‌; 1986లో) కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు భారత మహిళల జట్టు కథ ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 0–3తో థాయ్‌లాండ్‌ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–14, 15–21, 14–21తో చోచువోంగ్‌ చేతిలో... రెండో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 19–21, 5–21తో జాంగ్‌కోల్ఫాన్‌–రవింద ప్రజోంగ్‌జయ్‌ చేతిలో... మూడో మ్యాచ్‌లో అషి్మత చాలిహా 9–21, 16–21తో బుసానన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.    

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)