Breaking News

IPL 2024: హార్దిక్‌ను టార్గెట్‌ చేసే వారిపై ఉక్కుపాదం.. ఖండించిన ఎంసీఏ

Published on Sun, 03/31/2024 - 12:42

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పించి ఆ బాధ్యతలను గుజరాత్‌ నుంచి వలస వచ్చి హార్దిక్‌ పాండ్యకు అప్పజెప్పడాన్ని హిట్‌మ్యాన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంఐ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వారు హార్దిక్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. హార్దిక్‌ బహిరంగంగా కనపడిన ప్రతిసారి నోటితో పాటు చేతులకు కూడా పని చెబుతున్నారు (ఖాళీ బాటిళ్లను విసరడం). మైదానంలో అయితే హార్దిక్‌పై దూషణల పర్వం శృతి మించుతుంది. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ హార్దిక్‌కు మద్దతుగా నిలుస్తూ, అదనపు సెక్యూరిటీని కల్పిస్తున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముంబై ఇండియన్స్‌ తమ సొంత మైదానంలో ఆడే మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్‌ను ఎవరైనా టార్గెట్‌ చేస్తే వారిపై ఉక్కుపాదం​ మోపాలని ఎంసీఏ పోలీసులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై ఎంసీఏ స్పందించింది.

హార్దిక్‌ విషయంలో తాము పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. మైదానంలో మ్యాచ్‌ చూసేందుక వచ్చే ప్రేక్షకుల విషయంలో బీసీసీఐ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని వివరణ ఇచ్చింది. అయితే వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్‌ చేయడం సమర్దనీయం కాదని పేర్కొంది.

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో రేపు సొంత మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌ నేపథ్యంలోనే హార్దిక్‌ను అదనపు సెక్యూరిటీ కల్పిస్తారని ప్రచారం​ జరిగింది.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)